
దుబాయ్: మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఇకపై క్రికెటర్లు భారీ శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా సమావేశంలో ట్యాంపరింగ్‌కు శిక్షలు కఠినం చేయాలని నిర్ణయించారు. ఇకపై ట్యాంపరింగ్‌కు పాల్పడితే 6 టెస్టు మ్యాచ్‌లు లేదా 12 వన్డేల నిషేధం పడుతుంది. గత మార్చిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ట్యాంపరింగ్‌కు పాల్పడి పట్టుబడిన నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ శిక్షల స్థాయిని పెంచాలని ప్రతిపాదించింది.
మోసానికి పాల్పడటం, వ్యక్తిగత దూషణ, బూతులు వాడటం, అంపైర్ నిర్ణయాన్ని ధిక్కరించడంవంటి నాలుగు కొత్త అంశాలను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (క్రమశిక్షణా నియమావళి)లో చేర్చి వాటికి కూడా శిక్షలు విధించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment