
నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
లాహోర్: 'చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ప్రమేయమే. పాకిస్తాన్ ఫైనల్ కు చేరడంలో ఆటగాళ్ల గొప్పదనం ఏమీ లేదు. దీనికి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఉప్పొంగి పోవాల్సిన అవసరం కూడా లేదు'అని ఆ దేశ మాజీ ఆటగాడు అమిర్ సొహైల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ వ్యాఖ్యలను తాజాగా ఖండించాడు సొహైల్. జట్టు విజయానికి పరోక్షంగా తోడ్పడే వాళ్లను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాడు. అందులో మ్యాచ్ ఫిక్సింగ్, మోసానికి తావుందనేది తన ఉద్దేశం కాదన్నాడు. తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు.