
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో శనివారం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగనున్న మ్యాచ్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు అతను ఫిట్‌నెస్ సాధించిన విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ స్పష్టం చేశాడు.
తమకు ఎంతో కీలకమైన రేపటి మ్యాచ్‌కు ఏబీ అందుబాటులోకి రావడం శుభపరిణామం అని వెటోరి తెలిపాడు. మరొకవైపు సీఎస్‌కేతో మ్యాచ్‌కు డీకాక్ దూరం అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఒక వివాహ కార్యక్రమంలో భాగంగా స్వదేశానికి డీకాక్ వెళుతున్న కారణంగా మ్యాచ్‌కు దూరం కానున‍్నట్లు వెటోరీ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment