అభిషేక్ సెంచరీ | abhishek hita a ton in league match | Sakshi
Sakshi News home page

అభిషేక్ సెంచరీ

Published Tue, Jul 26 2016 10:11 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

అభిషేక్ సెంచరీ - Sakshi

అభిషేక్ సెంచరీ

చీర్‌ఫుల్ చమ్స్ 318/5
ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్

 
సాక్షి, హైదరాబాద్: చీర్‌ఫుల్ చమ్స్ బ్యాట్స్‌మన్ అభిషేక్ (73 బంతుల్లో 104; 14 ఫోర్లు, 3 సక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు.  ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సోమవారం ఆక్స్‌ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చీర్‌ఫుల్ జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 51 ఓవర్లలో 5 వికెట్లకు 318 పరుగులు చేసింది. జయకిరణ్ (33), కార్తీక్ (68 బ్యాటింగ్) రాణించారు. అంతకు ముందు ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 38,4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. డేవిస్ శామ్యూల్స్ (50) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. చీర్‌ఫుల్ జట్టు బౌలర్ విఘ్నేశ్ 5 వికెట్లతో ఆక్స్‌పర్డ్ జట్టును కట్టడి చేశాడు.
 
ఇతర మ్యాచ్‌ల వివరాలు: 

హైదరాబాద్ టైటాన్స్: తొలి ఇన్నింగ్స్ 99 (సులేమాన్ 30; నర్సింహ 3/44, వీర 5/21); రెండో ఇన్నింగ్స్ 107/3 (సల్మాన్ 40); క్లాసిక్ తొలి ఇన్నింగ్స్: 64 (గౌరవ్ శర్మ 6/36).

డబ్ల్యుఎంసీసీ: తొలి ఇన్నింగ్స్ 87 (నితిశ్ 4/12, అద్నాన్ 4/30); రెండో ఇన్నింగ్స్ 8/4 (అద్నాన్ 3/0); ఎలిగెంట్: 112 (అజయ్ సింగ్ 4/31).

రాజు సీసీ: 188 (అక్షయ్ యాదవ్ 45; బాలరాజు 3/41, రేవంత్ 3/39); హైదరాబాద్ యూనియన్: 70/2.

పాషా బీడీ: 413/9 డిక్లేర్డ్(ఫయాజ్ 152, నదీమ్ 115); ఎంసీసీ: 204 (సంతోష్ 81, రుద్ర 45, శ్రీనివాస్ 32); ఫాలో ఆన్: 132/4 (రుద్ర 64 నాటౌట్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement