సాక్షి, హైదరాబాద్: సర్దార్ సజ్జన్ సింగ్ సేథీ స్మారక మాస్టర్స్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ ఆబిద్ అలీఖాన్ సత్తా చాటాడు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఆబిద్ స్వర్ణ పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఆబిద్ విజేతగా నిలిచాడు. అతను 620.5 పాయింట్లు స్కోరు చేసి పసిడిని కైవసం చేసుకున్నాడు.
గుజరాత్‌కు చెందిన షూటర్ గోహిల్ హర్షరాజ్‌సింగ్ 617.4 పాయింట్లతో రజతాన్ని గెలుచుకోగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (మధ్యప్రదేశ్) 614.7 పాయింట్లు సాధించి కాంస్యాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన ఆబిద్ అలీఖాన్‌ను తెలంగాణ రైఫిల్ సంఘం (టీఆర్‌ఏ) అధ్యక్షులు అమిత్ సం ఘీ అభినందించారు. జాతీయ స్థాయి ఉత్తమ షూటర్లలో ఆబిద్ ఒక్కరన్న అమిత్ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment