ఆదిలాబాద్‌కు రెండు టైటిళ్లు | Adilabad got two ball badminton Championship Titles | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌కు రెండు టైటిళ్లు

Published Mon, May 28 2018 10:53 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Adilabad got two ball badminton Championship Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఆదిలాబాద్‌ జిల్లా జట్లు సత్తా చాటాయి. బాలానగర్‌లోని హెచ్‌ఎల్‌ఏ గ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన బాలుర  ఫైనల్లో ఆదిలాబాద్‌ 35–31, 29–35, 35–27తో కరీంనగర్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో కరీంనగర్‌ 35–25, 35–33తో ఖమ్మంపై, ఆదిలాబాద్‌ 35–29, 35–29తో రంగారెడ్డిపై గెలుపొందాయి.

బాలికల టైటిల్‌పోరులో ఆదిలాబాద్‌ 35–33, 35–29తో వరంగల్‌ను ఓడించింది. సెమీఫైనల్లో వరంగల్‌ 35–24, 35–22తో నల్లగొండపై, ఆదిలాబాద్‌ 35–28, 35–33తో నిజామాబాద్‌ జట్లపై విజయం సాధించాయి. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ అనిల్‌ మట్టూ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, కార్యదర్శి ఎ. రవీందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్‌. నారాయణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement