‘రషీద్ ఖాన్’ ఇప్పుడు క్రికెట్ అభిమానులు జపిస్తున్న పేరిది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్ - 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌తోనే కాక బ్యాటింగ్‌తో కూడా విజృంభించి తన సత్తా చూపించాడు. సన్‌రైజర్స్ కనీసం 150 కూడా స్కోరు చేయదని అనుకుంటున్న తరుణంలో బ్యాటింగ్‌తో చెలరేగి నాలుగు సిక్సర్లు బాది సన్‌రైజర్స్ స్కోరును 174కు పరుగెత్తించాడు. ఈ 19 ఏళ్ల అఫ్గాన్ క్రికెటర్‌కు ఇప్పుడు ఇండియాలో కూడా అభిమానులు తయారయ్యారు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించడంతో ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని అయితే రషీద్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
ఈ సందర్భంగా రషీద్ గురించి ట్విటర్‌లో ‘రషీద్ ఖాన్ చూసి అఫ్గాన్ గర్వపడుతుంది. ఈ సందర్భంగా నేను నా భారతీయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా దేశ ఆటగాడి ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించినందకు మీకు ధన్యవాదాలు. రషీద్ క్రికెట్ ప్రపంచానికి దొరికిన అరుదైన సంపద. మేము అతన్ని వదులుకోవాలనుకోవడంలేదు’ అని ట్వీట్ చేసి మోదీని టాగ్ చేసాడు. ఈ ట్వీట్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు అతనికి భారతీయ పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ రీట్వీట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఈ ట్విట్లకు స్పందిస్తూ విదేశీయులకు పౌరసత్వం ఇచ్చే అంశం హోం శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment