ఏడాదిన్నర తర్వాత...
మళ్లీ రెండో ర్యాంక్‌కు సైనా
న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ ఒక స్థానం ఎగబాకింది. గత వారం మూడో స్థానంలో ఉన్న సైనా ఇప్పుడు రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 2010 జులైలో తొలిసారి సైనా రెండో ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత ఎత్తుపల్లాల తర్వాత ఆఖరిసారిగా 2013 జూన్ రెండో వారంలో ‘నంబర్ టూ’గా ఉంది.
ఏడాదిన్నర కాలంగా పైకి వెళ్లలేకపోయిన సైనా... తాజాగా ఆల్ ఇంగ్లండ్ ప్రదర్శన అనంతరం మొత్తం 74, 381 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లీ జురి (చైనా) వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సింధు 9వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ (4), కశ్యప్ (12) తమ స్థానాలు నిలబెట్టుకోగా... ప్రణయ్ 17వ ర్యాంక్‌కు చేరాడు. డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 19వ ర్యాంక్‌కు వచ్చారు.