england championship
-
సింధు శుభారంభం
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వ్యోన్ లీ (బెల్జియం)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు తొలి గేమ్‌ను 14 నిమిషాల్లో 21–10తో సొంతం చేసుకుంది. ఈ దశలో గాయం కారణంగా వ్యోన్ లీ వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు. ఆకర్షి కశ్యప్ 16–21, 11–21తో పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–14, 13–21, 13–21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. ప్రపంచ నంబవర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 9–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏ దశలోనూ డెన్మార్క్ స్టార్‌కు పోటీనివ్వ లేకపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం. -
'ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'
ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టు నుంచి ఊధ్వసనకు గురైన వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటానికి పుజరా నిశ్చయించకున్నాడు. ఇక కౌంటీల్లో ఆడుతోన్న పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో పుజారా 720 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కౌంటీల్లో అద్భుతంగా రాణిస్తున్న పుజారాను సెలకెటర్లు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తన ఎంపికపై స్పందించిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆడకపోవడమే తనకు మంచిదైందని పుజారా తెలిపాడు. "మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఒక వేళ నన్ను ఐపీఎల్లో ఏదైనా జట్టు కొనుగోలు చేసి ఉంటే.. నాకు తుది జట్టులో అసలు అవకాశం దొరికేది కాదు. నేను నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకా ఏమి ఉండేది కాదు. అదే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడితే జట్టులో చోటుతో పాటు ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. అందుకే కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాను. నేను నా రిథమ్‌ను పొందడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాను. నేను ఇక్కడకు వచ్చేటప్పడే పాజిటివ్ దృక్పథంతో వచ్చాను. కానీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం మాత్రం నేను ఆడలేదు. నాఫామ్ను తిరిగి పొందడానికి ఒక పెద్ద ఇన్నింగ్స్ సహాయపడుతుందని నాకు తెలుసు" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA T20: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు -
భార్యను మందలించిన కశ్యప్
బర్మింగ్హమ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు సైతం మళ్లీ ఓటమి తప్పలేదు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సైనా వరుసగా 13వసారి ఓటమి చవిచూసింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ బ్రేక్ టైంలో ‘ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ సైనాకు సలహాలిచ్చాడు. ‘ఆచితూచి షాట్స్ ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. కోర్టును వదిలేస్తున్నావ్. ఆమె మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడుతోంది. అది గమనించు. ఆమె ఆడుతున్న తీరును చూడు’ అంటూ సలహా ఇచ్చాడు. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా 15–21, 19–21తో ఓటమి చవిచూసింది. ఇక బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. -
సైనా... వరుసగా 13వ‘సారీ’
బర్మింగ్హమ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్స్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరదించుతారని భావిస్తే అలాంటిదేమీ జరగలేదు. మనోళ్లందరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయారు. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. 2015లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ నంబర్‌వన్, చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. 37 నిమిషాల్లోనే ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 15–21, 19–21తో టాప్ సీడ్ తై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది. గతేడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ చేతిలో ఆమెకిది 15వ ఓటమి. 2013లో స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణిని ఓడించలేకపోయింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 16–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మొమోటా చేతిలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్‌కిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాను. కడుపులో నొప్పి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌లు ఆడి గెలవగలిగాను. తై జు యింగ్‌తో పదే పదే ఆడటం మంచిదే. ఆమెను ఎలా ఓడించాలనే విషయం నేర్చుకోవాల్సి ఉంది. సైనా నెహ్వాల్ -
ఏడాదిన్నర తర్వాత...
మళ్లీ రెండో ర్యాంక్‌కు సైనా న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ ఒక స్థానం ఎగబాకింది. గత వారం మూడో స్థానంలో ఉన్న సైనా ఇప్పుడు రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 2010 జులైలో తొలిసారి సైనా రెండో ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత ఎత్తుపల్లాల తర్వాత ఆఖరిసారిగా 2013 జూన్ రెండో వారంలో ‘నంబర్ టూ’గా ఉంది. ఏడాదిన్నర కాలంగా పైకి వెళ్లలేకపోయిన సైనా... తాజాగా ఆల్ ఇంగ్లండ్ ప్రదర్శన అనంతరం మొత్తం 74, 381 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లీ జురి (చైనా) వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సింధు 9వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ (4), కశ్యప్ (12) తమ స్థానాలు నిలబెట్టుకోగా... ప్రణయ్ 17వ ర్యాంక్‌కు చేరాడు. డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 19వ ర్యాంక్‌కు వచ్చారు. -
కశ్యప్ శుభారంభం
శ్రమించి నెగ్గిన సింధు, గురుసాయిదత్ శ్రీకాంత్ పరాజయం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గిమ్‌చియోన్ (కొరియా): అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 21-14, 21-17తో గో సూన్ హువాట్ (మలేసియా)పై గెలిచాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సూ జెన్ హావో (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సూ జెన్ హావోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వరుస గేముల్లో నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో గురుసాయిదత్ ముందంజ వేయగా... కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 22-20, 23-21తో ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 7-21, 14-21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు శ్రమించి గెలిచింది. ప్రపంచ 147వ ర్యాంకర్ చుయెంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-15, 15-21, 21-18తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)తో సింధు తలపడుతుంది. హిరోస్‌తో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి 21-18, 21-15తో ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 21-16, 13-21, 20-22తో లో జువాన్ షెన్-హెగ్ నెల్సన్ (మలేసియా) చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) 18-21, 19-21తో జాంగ్ వెన్-వాంగ్ యిల్వ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.