కేప్‌టౌన్: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో తాను కచ్చితంగా రాణిస్తానని టీమిండియా ప్రధాన ఆటగాడు అజింక్యా రహానే ధీమా వ్యక్తం చేశాడు. 2013లో దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం తనకు కలిసొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే సఫారీలతో పోరంటే అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డ రహానే.. వారితో ద్వైపాక్షిక సిరీస్ ఎప్పుడూ సవాలేనన్నాడు.
' ఇది కచ్చితంగా మాకు పెద్ద సిరీసే. దక్షిణాఫ్రికాలో వారితో ఎప్పుడూ తలపడినా మాకు చాలెంజ్‌గానే ఉంటుంది. కాకపోతే 2013లో పర్యటించిన భారత జట్టుకు.. నేటి జట్టుకు చాలా తేడా ఉంది. ప్రస్తుత భారత జట్టు చాలా బలంగా ఉంది. మా కాంబినేషన్లు కూడా బాగున్నాయి. దాంతో మేము సఫారీ గడ్డపై సత్తా చాటుతాం. ప్రధానంగా సఫారీ గడ్డపై బ్యాట్స్‌మెన్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. దక్షిణాఫ్రికా తరహా పిచ్‌ల్లో రాణిస్తేనే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది' అని రహానే పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment