విరాట్ కోహ్లి-అజింక్యా రహానే
డర్బన్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా విసిరిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత జట్టు 67 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో విరాట్ కోహ్లి-అజింక్యా రహానేలు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పారు.
అయితే ఈ జోడి మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై వారి దేశంలో భారత్‌కు ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2001లో టెండూల్కర్-గంగూలీల జోడి జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశాన్ని కోహ్లి-రహానేల జోడి తృటిలో కోల్పోయింది. రహానే-కోహ్లిలు మరో ఐదు పరుగులు జత చేసి ఉంటే సచిన్-గంగూలీల రికార్డు బద్దలయ్యేది. ఇదిలా ఉంచితే, 1997లో ఈస్ట్ లండన్‌లో సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ-రాహుల్ ద్రవిడ్‌లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. ఇది సఫారీ గడ్డపై భారత్‌కు మూడో అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment