
కరాచీ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు క్రీడాకారులు చేయూతనివ్వగా ఇప్పుడు వారి జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్‌లు చేరిపోయారు. తమ హయాంలో కీలక ఆటగాళ్లకు పేరుగాంచిన వీరిద్దరూ తమ వంతు సాయంగా వారు పదిలంగా దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను వేలంలో వేయడానికి సిద్ధమయ్యారు. కరోనా వైరస్ బాధితులకు అండగా నిలిచేందుకు నిధుల సేకరణ చేపట్టనున్నారు. తమ వస్తువుల ద్వారా వచ్చే మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. (షాట్ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!)
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ వస్తువులను వేలం వేయనున్నట్లు వీరు తెలిపారు. పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లను సాధించిన ఘనత అక్రమ్‌ది. 104 టెస్టుల్లో 414 వికెట్లు సాధించిన అక్రమ్.. 20సార్లు ఐదుకు పైగా వికెట్లను తీశాడు. ఇక 356 వన్డేల్లో 502 వికెట్లను అక్రమ్ సాధించాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ డారెన్ గాఫ్. 159 మ్యాచ్‌ల్లో 234 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు గాఫ్. ఇక్కడ జేమ్స్ అండర్సన్ 237 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
వరల్డ్‌కప్ విన్నింగ్ షర్ట్ వేలంలో..
ఇక మరో ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కూడా ముందుకొచ్చాడు. 2019 వరల్డ్‌కప్ గెలిచిన మ్యాచ్‌లో ధరించిన షర్ట్(జెర్సీ)ను వేలం వేయనున్నాడు. రవి బొపారాకు కూడా తన వంతు సాయంగా నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) బృందానికి ఫ్రీ చికెన్‌ను అందించనున్నాడు. తన సొంత రెస్టారెంట్ నుంచి వారికి చికెన్‌ను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment