సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్‌లో ఎం. అక్షయ లక్ష్మి, జి. పవన్ కార్తికేయ ఆకట్టుకున్నారు. అండర్–7 స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో పవన్ నిర్ణీత 5 రౌండ్లకు గాను 5 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 4 పాయింట్లతో టి. హవీశ్ కోవిధ్, కార్తికేయ నందన్ అశ్విన్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా హవీశ్ రన్నరప్‌గా నిలవగా... కార్తికేయ నందన్ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు.
బాలికల కేటగిరీలో 5 పాయింట్లు సాధించిన అక్షయ లక్ష్మి విజేతగా నిలిచింది. అనయా అగర్వాల్, ఎన్‌పీ హరిణి వరుసగా రెండు, మూడు స్థానాలను సంపాదించారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన అక్షయ లక్ష్మి, పవన్ కార్తికేయ తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు జాతీయ అండర్–7 చెస్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు. పోటీలో పతకాలు సాధించిన వారిని తెలంగాణ రాష్ట్ర చెస్ సం ఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment