బంతి తగిలి అలెక్స్‌ క్యారీ విలవిల | Alex Carey Injured in Archers Bowling | Sakshi

బంతి తగిలి అలెక్స్‌ క్యారీ విలవిల

Jul 11 2019 4:00 PM | Updated on Jul 11 2019 4:17 PM

Alex Carey Injured in Archers Bowling - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు.  ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడపోయిన క్యారీ.. డ్రెస్పింగ్‌ రూమ్‌కు సైగలు చేశాడు. ఆసీస్‌ ఫిజియో మైదానంలోకి వచ్చేసరికి దవడ కింది భాగం నుంచి రక్తం కారుతూ ఉంది. దాంతో క్యారీ రిటైర్ట్‌ హర్ట్‌ అవుతాడని అనుకున్నరంతా.

అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్‌ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు.  రక్తం కారుతున్న చోట ప్లాస్టర్‌ వేసుకుని బ్యాటింగ్‌ను యథావిధిగా కొనసాగించాడు. ఆసీస్‌ 14 పరుగు వద్ద ఉండగా హ్యాండ్స్‌కాంబ్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్యారీ క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికి క్యారీ ఇలా గాయపడటం ఆసీస్‌ శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, ఆసీస్‌ స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు చేజార్చుకుంది. ఫించ్‌ గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కాగా, వార్నర్‌(9) సైతం నిరాశపరిచాడు. హ్యాండ్స్‌కాంబ్‌ నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. దాంతో ఆసీస్‌ కష్టాల్లో పడింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement