ఏదో ఒక పదవిలో కొనసాగండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీర్పు సందర్భంగా ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీనివాసన్ ఒక్క పదవికే పరిమితం కావాలని సూచించింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటారా లేదా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమానిగా ఉంటారా అనేది ఆయనే తేల్చుకోవాలని పేర్కొంది. ఐపీఎల్ జట్టును దక్కించుకోవడం కోసం శ్రీనివాసన్ బీసీసీఐ మార్గదర్శకాలను సవరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
కాగా, బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉంటానని శ్రీనివాసన్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.