'నేనిప్పుడు మాట్లాడను'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ మౌనం దాల్చారు. కోర్టు తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. 'తీర్పుపై నేనిప్పుడు మాట్లాడను' అని మీడియాతో అన్నారు.
జోడు పదవులు నిర్వహించొద్దని శ్రీనివాసన్ ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. బీసీసీఐ అధ్యక్ష పదవి, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల్లో ఎదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని ఆయనకు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసన్ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.