శభాష్ పవార్.. | Anand Pawar enters Brazil Grand Prix semis | Sakshi
Sakshi News home page

శభాష్ పవార్..

Published Sat, Sep 3 2016 1:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

శభాష్ పవార్..

శభాష్ పవార్..

ఫోజ్ డో ఇగుకు(బ్రెజిల్): బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఓపెన్  బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆద్యంత ఆద్భుత ప్రతిభ కనబరిచిన భారత ఆటగాడు ఆనంద్ పవార్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నాల్గో సీడ్ పవార్ 21-8, 21-10 తేడాతో అన్ సీడెడ్ బీఆర్ సంకీర్త్(కెనడా)పై గెలిచి సెమీస్ కు చేరాడు. 2015లో స్విస్ అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ కు చేరిన తరువాత ఆనంద్ పవార్ కు ఇదే తొలి సెమీ ఫైనల్.

తొలి రౌండ్లో  21-6, 21-7 తేడాతో బ్రెజిల్ ఆటగాడు మాథ్యూస్ వైగ్ట్ను మట్టికరిపించిన పవార్.. రెండో రౌండ్లో 21-8, 21-8 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు విల్సన్పై విజయం సాధించాడు. ఈ ఏడాది సెమీస్ కు చేరడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన పవార్.. తన తదుపరి పోరులో రెండో సీడ్, ఇజ్రాయిల్ ఆటగాడు మిషా జిల్బర్ మెన్తో తలపడతాడు.

ఇదిలా ఉండగా, మిక్స్డ్ డబుల్స్ లో సిక్కి రెడ్డి- చోప్రా జంట కూడా సెమీస్ కు చేరింది. ఈ జోడి 21-18, 21-11 తేడాతో ఆతిథ్య బ్రెజిల్ జంట మాథ్యూస్ వైగ్ట్- బియానికా ఓలివిరియా లిమాపై గెలిచి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ జంట  తమ ఫైనల్ బెర్తు కోసం జర్మనీ ద్వయం ఫబియన్ హోల్జర్-బార్బరా బెల్లింగ్ బర్గ్లతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement