ఆంధ్రకు మరో ఓటమి | Andhra team lost T20 tournment | Sakshi
Sakshi News home page

ఆంధ్రకు మరో ఓటమి

Published Thu, Apr 3 2014 12:53 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

ఆంధ్రకు మరో ఓటమి - Sakshi

ఆంధ్రకు మరో ఓటమి

సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్‌జోన్ టి20 టోర్నీలో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 32 పరుగుల తేడాతో ఓడింది.
 
 వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ముందుగా తమిళనాడు 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మురళీ విజయ్ (40 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), అపరాజిత్ (33 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 15.2 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీకాంత్ (28 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా  అంతా విఫలమయ్యారు. రాహిల్ షా (4/26) నాలుగు వికెట్లతో చెలరేగాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement