బంగ్లా పోరాటం వృథా | Angelo Mathews' keeps Bangladesh winless | Sakshi
Sakshi News home page

బంగ్లా పోరాటం వృథా

Published Fri, Mar 7 2014 1:26 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

బంగ్లా పోరాటం వృథా - Sakshi

బంగ్లా పోరాటం వృథా

 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక విజయం  
 ఆసియాకప్
 
 మిర్పూర్: ఆసియాకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ పోరాడి ఓడిపోయింది. గురువారం షేర్-ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.
 
 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అనాముల్ హక్ (49),రెహమాన్ (39) పరుగులతో రాణించారు. లక్మల్ (2/32), తిషార పెరీరా (2/29), మెండిస్ (2/55), ప్రియంజన్ (2/11) బంగ్లాను కట్టడి చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.
 
 మాథ్యూస్ (103 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన శ్రీలంక... లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం (17 పాయింట్లు)లో నిలిచింది. గత ఏడాది ఫైనలిస్ట్ బంగ్లాదేశ్ ఈ సారి ఒక్క విజయం కూడా లేకుండా టోర్నీని ముగించింది. శనివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడుతుంది.
 
 మాథ్యూస్ కెప్టెన్ ఇన్నింగ్స్
 ఫైనల్‌కు ప్రాక్టీస్‌గా భావించిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 205 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్టకష్టాలు పడింది. ఓపెనర్ కుషాల్ పెరీరా (0), సంగక్కర (2), జయవర్ధనె (0) విఫలమయ్యారు. ప్రియంజన్ (24), తిరిమన్నె (33) ఫర్వాలేదనిపించినా... శ్రీలంక 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూస్.... చతురంగ డిసిల్వా (44)తో కలిసి ఆరో వికెట్‌కు 82 పరుగులు జోడించి లంకను గెలిపించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement