
హరికృష్ణకు రెండో ‘డ్రా’
న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. భారత్‌కే చెందిన అభిజిత్ గుప్తాతో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం ఎదురైంది. ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన గేమ్‌లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. ఫియాలా విక్లావ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌లో ఆనంద్ 32 ఎత్తుల్లో గెలిచాడు.