
లీడ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన బ్యాటింగ్ శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు ఆఫ్‌సైడ్ బంతులు సంధించే క్రమంలో వాటిని స్మిత్ వదిలేసి క్రమంలో సరికొత్త టెక్నిక్‌ను ఫాలో అయ్యాడు. అది అభిమానుల్లో నవ్వులు పూయించింది. అయితే డ్రాగా ముగిసిన ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చేయలేదు. ఆర్చర్ బౌలింగ్‌లో మెడకు బలంగా తాకడంతో స్మిత్ తన రెండో ఇన్నింగ్స్‌కు దూరం కావాల్సి వచ్చింది.
కాగా, ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు సన్నద్ధమైన సందర్భంలో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అచ్చం స్మిత్ ఏ రకంగా బంతుల్ని విడిచిపెట్టాడో దాన్ని ఆర్చర్ అనుసరించాడు. ఈ వీడియోను క్రికెట్ డాట్ కామ్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. గురువారం ఇరు జట్ల మధ్య లీడ్స్‌లో యాషెస్ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు స్మిత్ దూరమయ్యాడు.
Is that Jofra Archer or Steve Smith in the nets at Headingley? #Ashes @alintaenergy pic.twitter.com/RT5ADoSUjr
— cricket.com.au (@cricketcomau) August 22, 2019