
జైపూర్: ఆస్టన్ టర్నర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని నెలల క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదే సమయంలో ఈ బ్యాట్స్‌మన్ ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. టీ20 చరిత్రలోనే వరుసగా ఐదుసార్లు డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్‌తో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన టర్నర్ అన్నింటిలోనూ సున్నా పరుగులకే ఔటయ్యాడు.
అంతకుముందు బిగ్‌బాష్ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. ఇందులో నాలుగు సందర్భాల్లో తొలి బంతికే(గోల్డెన్ డక్) ఔట్ కావడం గమనార్హం. హార్డ్ హిట్టర్‌గా పేరుగాంచిన టర్నర్.. ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇది రాజస్తాన్ రాయల్స్ మింగుడు పడని అంశం. సోమవారం ఢిల్లీ క్యాపిట్స్‌తో జరిగిన మ్యాచ్ టర్నర్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్ సమర్పించుకుని మైదానంలో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment