
‘హ్యాట్రిక్’పై ఆసీస్ గురి
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ జరిగిన మూడు టోర్నీల్లో... ఒకసారి ఇంగ్లండ్ గెలిస్తే... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. మహిళల విభాగంలో ఈ రెండు జట్లదే ఆధిపత్యం.
మధ్యాహ్నం. గం. 2.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
ఇంగ్లండ్‌తో ఫైనల్ నేడు
మహిళల టి20 ప్రపంచకప్
సాక్షి, ఢాకా: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ జరిగిన మూడు టోర్నీల్లో... ఒకసారి ఇంగ్లండ్ గెలిస్తే... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. మహిళల విభాగంలో ఈ రెండు జట్లదే ఆధిపత్యం.
మరోసారి కూడా ఈ రెండు జట్లే తమ సత్తాను నిరూపించుకుంటూ ఫైనల్‌కు చేరాయి. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా... 2009 విజేత ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈసారి కూడా గెలిస్తే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది.