
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ జట్టు వరుసగా రెండు పరాజయాల తర్వాత తమ ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకుంది. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవధ్ 4–3తో గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో క్రిస్టినా–తాంగ్ చున్ మాన్ 14–15, 15–12, 15–14తో కామిల్లా–లా చుక్ హిమ్ జంటపై గెలిచి అవధ్‌కు 1–0 ఆధిక్యం అందించారు. పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో కశ్యప్ 11–15, 15–13, 15–14తో సౌరభ్ వర్మను ఓడించడంతో అవధ్ ఆధిక్యం 3–0కు పెరిగింది.
మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో ప్రణయ్ 15–8, 15–11తో శ్రీకాంత్‌ను ఓడించడంతో అహ్మదాబాద్ ఖాతా లో తొలి పాయింట్ చేరింది. మహిళల సింగిల్స్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌లో తై జు యింగ్ 15–5, 15–14తో సైనాపై నెగ్గడంతో అహ్మదాబాద్ స్కోరును 3–3తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సెతియవాన్–తాంగ్ చున్ మాన్ ద్వయం 15–14, 15–10తో నందగోపాల్–రెగినాల్డ్ (అహ్మదాబాద్) జంటను ఓడించి అవధ్‌కు 4–3తో విజయాన్ని ఖాయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment