
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ 6–(–1)తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌ను చిత్తుచేసింది. అవధ్ ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ 10–15, 15–11, 15–11తో కిర్‌స్టీ గిల్మోర్ (అహ్మదాబాద్)పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో లీ యంగ్–క్రిస్టియాన్సన్ (అవధ్) జంట 15–12, 10–15, 15–6తో నందగోపాల్–సాత్విక్ సాయిరాజ్ ద్వయంపై నెగ్గింది.పురుషుల సింగిల్స్‌లో సన్ వాన్ హో (అవధ్) 15–7, 8–15, 15–10తో అక్సెల్‌సన్‌ను ఓడించడంతో 4–0తో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే వారియర్స్ విజయం ఖాయమైంది.
రెండో పురుషుల సింగిల్స్‌ను అహ్మదాబాద్ ‘ట్రంప్’గా ఎంచుకోగా... సౌరభ్ వర్మ 8–15, 12–15తో లీ డాంగ్ క్యున్ (అవధ్) చేతిలో చిత్తుగా ఓడాడు. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–సిక్కి రెడ్డి జోడీ 15–13, 10–15, 12–15తో క్రిస్టియాన్సన్–అశ్విని పొన్నప్ప జంట చేతిలో ఓడింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్, బెంగళూరు రాప్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment