
సాక్షి, హైదరాబాద్: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు తెలంగాణకు చెందిన ఆరుగురు షూటర్లు ఎంపికైనట్లు తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. క్లే పీజియన్ ట్రాప్ పురుషుల విభాగంలో కైనన్ షెనాయ్, క్లే పీజియన్ స్కీట్ జూనియర్ పురుషుల కేటగిరీలో ఆయుశ్ రుద్రరాజు, 50మీ. రైఫిల్ ప్రోన్ పురుషుల విభాగంలో గగన్ నారంగ్, 50మీ. రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషుల విభాగంలో అబిద్ అలీఖాన్, 10మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల కేటగిరీలో మాస్టర్ ధనుశ్ శ్రీకాంత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 10మీ. ఎయిర్ పిస్టల్ జూనియర్ మహిళల విభాగంలో ఇషా సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దోహాలోని ఖతర్ వేదికగా నవంబర్‌లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment