అబుదాబి: క్రికెట్‌లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. అయితే స్టైకర్-నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్ అయిపోయి పిచ్ మధ్యలో ముచ్చట్లు పెట్టే క‍్రమంలో రనౌట్ కావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ తరహా రనౌట్ తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టెస్టు అబుదాబిలో జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో అజహర్ అలీ(64) విచిత్రంగా రనౌట్ అయ్యాడు.
ఆసీస్ పేసర్ సిడెల్ వేసిన 53 ఓవర్ మూడో బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది. ఇది ఫోర్‌గా భావించిన అజహర్ అలీ-అసద్ షఫిక్‌లు పిచ్ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆ బంతిని అందుకున్న స్టార్క్.. కీపర్ పైనీకి విసిరాడు. బంతిని అందుకున్న మరుక్షణమే పైనీ వికెట్లను గిరటేశాడు. దాంతో ఒక్కసారిగా షాక్ గురైన అజహర్ అలీ-అసద్ షఫిక్‌లు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఇది నిబంధనల ప్రకారం ఔట్ కావడంతో అజహర్ అలీ భారంగా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. మరొకవైపు చిన్నపిల్లాడిలా రనౌట్‌గా పెవిలియన్ చేరడం స్టేడియంలోని అభిమానులకు నవ్వులు తెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment