అంచనాలకు అనుగుణంగా రాణించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్‌లో సంయోగిత–ప్రజక్తా సావంత్ జంట మినహా తొలి రోజు బరిలోకి దిగిన వారందరూ విజయం రుచి చూడటం విశేషం. భారత నంబర్‌వన్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, ప్రణయ్ అలవోక విజయాలతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్
మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్ (vs) దెమిర్‌బాగ్ (టర్కీ)
పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ (vs) ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)
మహిళల డబుల్స్: కుహూ గార్గ్, నింగ్షీ హజారికా (vs) చాంగ్ చింగ్ హుయ్, యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ); మేఘన, పూర్వీషా (vs) దెబోరా జిలి, ఇమ్కె వాన్ డెర్ (నెదర్లాండ్స్); సిక్కి, అశ్విని (vs) చియాంగ్ కై సిన్, హుంగ్ షి హాన్ (చైనీస్ తైపీ)
పురుషుల డబుల్స్: సాత్విక్, చిరాగ్ శెట్టి (vs) మార్కస్ ఇలిస్, క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్); కోన తరుణ్, సౌరభ్ శర్మ (vs) ఆర్ చిన్ చుంగ్, టాంగ్ చున్ మాన్ (హాంకాంగ్); అర్జున్, శ్లోక్ (vs) ఓంగ్ యు సిన్, తియో ఎ యి (మలేసియా)
మిక్స్‌డ్ డబుల్స్: సిక్కి, ప్రణవ్ (vs) హఫీజ్, గ్లోరియా (ఇండోనేసియా); సౌరభ్ శర్మ, అనుష్క (vs) చాన్ పెంగ్ సూన్, (vs) లియు యింగ్ (మలేసియా); సాత్విక్, అశ్విని (vs) లామ్స్‌ఫస్, ఇసాబెల్ (జర్మనీ); రోహన్, కుహూ (vs) క్రిస్, గాబ్రియేలా (ఇంగ్లండ్)
ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment