ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు! | saina nehwal is not my real friend, says pv sindhu | Sakshi
Sakshi News home page

ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు!

Published Tue, Sep 23 2014 10:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు!

ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు!

సైనా నెహ్వాల్ తనకు నిజమైన ఫ్రెండ్ కాదంటోంది బ్యాడ్మింటన్ తెలుగు తేజం పీవీ సింధు. సంచలన విజయాలతో దూసుకుపోతున్న సింధు తన గురించి పలు విషయాలు మీడియాతో పంచుకుంది. సైనాకు తనకు స్నేహం లేదని అలాగని శత్రుత్వం కూడా లేదని తెలిపింది. తాము 'హాయ్', 'హల్లో' మిత్రులమని స్పష్టం చేసింది. ఆటల్లో తాము సహ క్రీడాకారులమని పేర్కొంది. సిక్కి రెడ్డి(డబుల్స్ ప్లేయర్) తనకు మించి మిత్రురాలని, అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటానని వెల్లడించింది.

తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని తెలిపింది. మహేష్బాబు, ప్రభాస్ తన అభిమాన నటులని చెప్పింది. అయితే సినిమా హిట్ అయితేనే చూస్తానని, ఫ్లాప్ అయితే చూడబోనని స్పష్టం చేసింది, విమాన ప్రయాణాల్లోనే సినిమాలు చూస్తానని... వీలు కుదిరితే స్నేహితులు, తల్లిదండ్రులతో కలిసి థియేటర్లను వెళతానని వెల్లడించింది. తనను ఎవరూ గమనించనప్పుడు మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తుంటానని చెప్పింది.

ఇప్పటివరకు ప్రేమలో పడలేదని, తనకెవరూ బాయ్ఫెండ్ లేరని సింధు తెలిపింది. తన అక్క అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అయితే లక్నో గ్రాండ్ పిక్స్ టోర్నమెంట్ కారణంగా ఆమె పెళ్లికి హాజరుకాలేకపోయానని చెప్పింది. ఎనిమిదో తరగతి వరకు స్కూల్ కు మానకుండా వెళ్లేదాన్నని, బ్యాడ్మింటన్ ను సీరియస్ గా తీసుకున్నాక పాఠశాలకు ఎక్కువగా వెళ్లలేకపోయేదాన్ని అని వివరించింది. మాస్కోలో టోర్ని కారణంగా టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా రాయలేకపోయానని వెల్లడించింది. 19 ఏళ్ల సింధు ఇప్పుడు బికామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 18 ఏళకే అర్జున అవార్డు అందుకున్న సింధు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని టైటిల్స్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement