ఢాకా: ఆసియా కప్ క్రికెట్ బంగ్లాదేశ్‌లోనే జరుగుతుందని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రకటించింది. టోర్నీలో ఆడేందుకు ఇన్నాళ్లూ తటపటాయించిన పాకిస్థాన్ జట్టు... ఇప్పుడు అంగీకరించడంతో ఈ ప్రకటన వెలువరించింది. పాక్ టీమ్‌కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
‘సహజంగానే ఉపఖండపు దేశాల్లో టోర్నీల్లో ఆడేందుకు ఏ జట్టుకైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. పాక్ భద్రతాధికారి శనివారం వచ్చి పరిస్థితిని సమీక్షిస్తారు. అయితే జట్టు ఆడటం మాత్రం ఖాయమైంది. ఈ నెల 22న పాక్ టీమ్ ఢాకా చేరుకుంటుంది’ అని ఏసీసీ సీఈ అష్రాఫుల్ హఖ్ వెల్లడించారు. ఫిబ్రవరి 25నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు తొలి సారి అఫ్ఘనిస్థాన్ కూడా బరిలోకి దిగుతోంది. మొత్తం 11 మ్యాచ్‌లలో ఐదింటిని ఫతుల్లాలో, ఫైనల్ సహా ఆరు మ్యాచ్‌లను మిర్పూర్‌లో నిర్వహిస్తారు.
బంగ్లాలోనే ఆసియా కప్
Published Fri, Jan 17 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement