క్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ఆంధప్రదేశ్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భువన 6-4, 6-4తో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై విజయం సాధించింది.
మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-0, 2-6, 7-6 (7/2)తో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవి (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఇతర క్రీడాకారిణులు అనుష్క భార్గవ, మహిత దాడిరెడ్డి, సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఎతీ మెహతా (భారత్) 6-3, 6-0తో అనుష్కపై, ప్రార్థన తోంబ్రే (భారత్) 2-6, 6-2, 7-6 (7/4)తో సౌజన్యపై, శ్వేతా రాణా (భారత్) 7-6 (7/4), 7-5తో మహిత రెడ్డిపై నెగ్గారు.