నవంబరు 17 నుంచి విశాఖలో టెస్టు | BCCI announces dates for England tour of India | Sakshi
Sakshi News home page

నవంబరు 17 నుంచి విశాఖలో టెస్టు

Published Sat, Jul 16 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

BCCI announces dates for England tour of India

ఇంగ్లండ్‌తో సిరీస్ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: తొలిసారిగా విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రెండో టెస్టుకు విశాఖ వేదిక కానుంది. నవంబర్ 17 నుంచి 21 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అలాగే తొలి టెస్టు (నవంబర్ 9-13) జరిగే రాజ్‌కోట్‌కు కూడా ఇదే మొదటి మ్యాచ్. మిగతా మూడు టెస్టులు మొహాలీ (నవంబర్ 26-30), ముంబై (డిసెంబర్ 8-12), చెన్నై (డిసెంబర్ 16-20)లలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో కూడా డేనైట్ టెస్టుల ప్రస్తావన లేదు.

ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు టెస్టులతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లలో భారత్‌తో తలపడుతుంది. వచ్చే జనవరి 15 నుంచి వన్డే సిరీస్, 26నుంచి టి20లు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement