ఆస్ట్రేలియా ఓపెన్ లో రఫెల్ నాదల్ ఓటమి | berdych defeats nadal | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ లో రఫెల్ నాదల్ ఓటమి

Published Tue, Jan 27 2015 11:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

ఆస్ట్రేలియా ఓపెన్ లో రఫెల్ నాదల్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ లో రఫెల్ నాదల్ ఓటమి

మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇంటి ముఖం పట్టాడు.మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నాదల్ 6-2,6-0, 7-6(7-5)  తేడాతో బెర్డిచ్ చేతిలో ఓటమి పాలైయ్యాడు. ఏ దశలోనూ బెర్డిచ్ దాటికి తట్టుకోలేకపోయిన నాదల్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదిలోనే రోజర్ ఫెదరర్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో నాదల్ పై ఆశలు భారీగా ఉన్నాయి. అయితే బెర్డిచ్ మాత్రం అసామాన్య ప్రతిభ కనబరుస్తూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లాడు.

 

వరుస రెండు సెట్లను అవలీలగా గెలిచిన బెర్డిచ్ మూడో సెట్ ను గెలవడానికి తీవ్రంగా శ్రమటోడ్చాల్సి వచ్చింది.  మూడో గేమ్ టై బ్రేక్ కు దారి తీసినా.. బెర్డిచ్ చివరికంటూ పోరాడి మూడో సెట్ ను కూడా  కైవశం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement