‘మాడ్రిడ్’ ఫైనల్లో బోపన్న జంట | bopanna team in Madrid finals | Sakshi
Sakshi News home page

‘మాడ్రిడ్’ ఫైనల్లో బోపన్న జంట

Published Sun, May 10 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

‘మాడ్రిడ్’ ఫైనల్లో బోపన్న జంట

‘మాడ్రిడ్’ ఫైనల్లో బోపన్న జంట

న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (4/7), 6-3, 11-9తో ఆరో సీడ్ గ్రానోలెర్స్-లోపెజ్ (స్పెయిన్) జోడీపై సంచలన విజయం సాధించింది.

తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జంట రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లోని కీలకదశలో పాయింట్లు సాధించిన బోపన్న విజయాన్ని ఖాయం చేసుకుంది. డానియల్ నెస్టర్‌తో కలిసి ఈ ఏడాది రెండు టైటిల్స్ నెగ్గిన బోపన్న.. మెర్జియాతో కలిసి మరో టోర్నీలో  రన్నరప్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement