
దుబాయ్: వెస్టిండీస్ పార్ట్ టైమ్ బౌలర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి ఫిర్యాదు అందింది. భారత్‌తో గత సోమవారం ముగిసిన రెండో టెస్టులో బ్రాత్‌వైట్ బౌలింగ్ చేశాడు. అయితే అతని నిబంధనలకు లోబడి లేదని ఫీల్డ్ అంపైర్లు గుర్తించడంతో ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా విండీస్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఈ నెల 14లోపు బ్రాత్‌వైట్ తన బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అప్పటివరకూ తన బౌలింగ్‌ను కొనసాగించవచ్చు.
వాస్తవానికి బ్రాత్‌వైట్ ప్రొఫెషనల్ బౌలర్ కాదు. ఓపెనర్‌గా పేరొందిన ఈ క్రికెటర్.. అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే భారత్‌పై టెస్టుల్లోనూ కొన్ని ఓవర్లు వేశాడు. గతంలోనూ బ్రాత్‌వైట్ బౌలింగ్‌పై ఫిర్యాదులు వచ్చాయి. 2017, ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతని బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఫిర్యాదు చేశారు. కాగా, అప్పట్లో పరీక్షలు నిర్వహించిన ఐసీసీ నెల తర్వాత అతనికి క్లీన్‌చీట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment