
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సిక్కి రెడ్డి జంట
హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం బ్రెజిల్‌లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21-15, 21-16తో రెండో సీడ్ టోబీ ఎన్జీ-రాచెల్ హోండెరిచ్ (కెనడా) జోడీపై విజయం సాధించింది.
టోర్నీ మొత్తంలో సిక్కి-ప్రణవ్ జంట తమ ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన ఆనంద్ పవార్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఆనంద్ పవార్ 21-18, 11-21, 17-21తో జుల్ఫాదిల్ జుల్కిఫిల్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు.