
22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ
ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ విజృంభించాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికి 31 హాఫ్ సెంచరీ కాగా, ఈ టోర్నమెంట్లో నాల్గోది.
కివీస్ 8 ఓవర్లలో 77/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ కల్లమ్ అవుటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో స్టెయిన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ జోరు తగ్గింది. గప్టిల్(6), విలియమ్సన్(2) క్రీజ్ లో ఉన్నారు.