
18 బంతుల్లోనే అర్థ సెంచరీ
వెల్లింగ్టన్: ఇంగ్లండ్ తమ ముందు ఉంచిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ రెచ్చిపోయారు. ఇంగ్లీషు బౌలర్లను ఉతికిపాడేశాడు.
గుప్తిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మెక్ కల్లమ్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెక్ కల్లమ్ విజృంభణతో 3.4 ఓవర్ లోనే స్కోరు 50 పరుగులు దాటింది. మొదటి వికెట్ కు 22 బంతులోనే 50 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలో 67/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కివీస్ దూకుడు చూస్తుంటే 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసేలా ఉంది.