‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన | BWF nominates Saina Nehwal for Woman Player of the Year Award | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన

Published Sat, Dec 5 2015 1:08 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన - Sakshi

‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన

బీడబ్ల్యూఎఫ్ అవార్డులు
దుబాయ్: ఈ ఏడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ అవార్డుకు భారత స్టార్ సైనా నెహ్వాల్ పేరును ప్రతిపాదించారు. సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో పాటు నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించినందుకు ఈమె పేరును సిఫారసు చేశారు. కరోలినా మారిన్ (స్పెయిన్), జావో యునెలి, బావో జిన్ (చైనా)లు కూడా ఈ అవార్డుకు పోటీపడుతున్నారు.

పురుషుల విభాగంలో చెన్ లాంగ్, జాంగ్ నాన్ (చైనా), లీ యాంగ్ డే, యూ ఇయోన్ సీయోంగ్ (కొరియా) అవార్డు రేసులో ఉన్నారు. ఎంపికైన వారి పేర్లను ఈనెల 7న దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ రిసెప్షన్, గాలా డిన్నర్‌లో ప్రకటిస్తారు. చెన్నై బాధితులకు రూ.2 లక్షల విరాళం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను సైనా విరాళంగా ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement