BWF awards
-
బీడబ్ల్యూఎఫ్ అవార్డు రేసులో సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక అవార్డుల్లో భాగంగా ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో భారత డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు స్థానం లభించింది. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గడంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో మిచెల్లి లీ (మహిళల సింగిల్స్–కెనడా), కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (మహిళల డబుల్స్–కొరియా), ప్రవీణ్ జోర్డాన్–మేలతి దేవ ఒక్టావియాంతి (మిక్స్డ్ డబుల్స్–ఇండోనేసియా) కూడా ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో భారత్‌కే చెందిన ప్రమోద్ భగత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉన్నాడు. ప్రమోద్ ఈ ఏడాది జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీల్లో మొత్తం 10 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు గెలిచాడు. ఈనెల 9న చైనాలోని గ్వాంగ్జూలో జరిగే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ప్రారంభోత్సవంలో విజేతలను ప్రకటిస్తారు. -
‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన
బీడబ్ల్యూఎఫ్ అవార్డులు దుబాయ్: ఈ ఏడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ అవార్డుకు భారత స్టార్ సైనా నెహ్వాల్ పేరును ప్రతిపాదించారు. సీజన్లో నిలకడైన ప్రదర్శనతో పాటు నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించినందుకు ఈమె పేరును సిఫారసు చేశారు. కరోలినా మారిన్ (స్పెయిన్), జావో యునెలి, బావో జిన్ (చైనా)లు కూడా ఈ అవార్డుకు పోటీపడుతున్నారు. పురుషుల విభాగంలో చెన్ లాంగ్, జాంగ్ నాన్ (చైనా), లీ యాంగ్ డే, యూ ఇయోన్ సీయోంగ్ (కొరియా) అవార్డు రేసులో ఉన్నారు. ఎంపికైన వారి పేర్లను ఈనెల 7న దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ రిసెప్షన్, గాలా డిన్నర్లో ప్రకటిస్తారు. చెన్నై బాధితులకు రూ.2 లక్షల విరాళం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను సైనా విరాళంగా ప్రకటించింది.