Indian star Saina Nehwal
-
హైదరాబాద్‌కు లీ చోంగ్ వీ... లక్నోకు సైనా
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మేటి క్రీడాకారుడు లీ చోంగ్ వీలకు అత్యధిక మొత్తం దక్కింది. లక్నోకు చెందిన అవధ్ వారియర్స్ సైనాను ... హైదరాబాద్ హంటర్స్ లీ చోంగ్ వీను చెరో లక్ష డాలర్లకు (రూ. 66 లక్షల 69 వేలు) సొంతం చేసుకున్నాయి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధును 95 వేల డాలర్లకు (రూ. 63 లక్షల 35 వేలు) చెన్నై స్మాషర్స్... శ్రీకాంత్‌ను 80 వేల డాలర్లకు (రూ. 53 లక్షల 35 వేలు) బెంగళూరు టాప్‌గన్స్ జట్లు తీసుకున్నాయి. సైనా నెహ్వాల్, లీ చోంగ్ వీలను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. దాంతో ఆదివారం రాత్రే లాటరీని నిర్వహించారు. లాటరీలో అవధ్ వారియర్స్‌కు సైనా... హైదరాబాద్ హంటర్స్‌కు లీ చోంగ్ వీ దక్కారు. సోమవారం మిగతా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. పీబీఎల్ జనవరి 2న ముంబైలో మొదలై 17న న్యూఢిల్లీలో ముగుస్తుంది. మిగతా ఆటగాళ్ల వివరాలు: పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్ హంటర్స్-35 వేల డాలర్లు), సుమీత్ రెడ్డి (బెంగళూరు టాప్‌గన్స్-25 వేల డాలర్లు), మనూ అత్రి (ముంబై రాకెట్స్-25 వేల డాలర్లు), గుత్తా జ్వాల (హైదరాబాద్ హంటర్స్-30 వేల డాలర్లు), అశ్విని పొన్నప్ప (బెంగళూరు టాప్‌గన్స్-30 వేల డాలర్లు), హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్-47 వేల డాలర్లు), వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా-ముంబై రాకెట్స్, 42 వేల డాలర్లు), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్-ఢిల్లీ ఏసర్స్, 36 వేల డాలర్లు), టామీ సుగియార్తో (ఇండోనేసియా-ఢిల్లీ ఏసర్స్, 74 వేల డాలర్లు). -
‘ఉత్తమ క్రీడాకారిణి’గా సైనా పేరు ప్రతిపాదన
బీడబ్ల్యూఎఫ్ అవార్డులు దుబాయ్: ఈ ఏడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ అవార్డుకు భారత స్టార్ సైనా నెహ్వాల్ పేరును ప్రతిపాదించారు. సీజన్లో నిలకడైన ప్రదర్శనతో పాటు నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించినందుకు ఈమె పేరును సిఫారసు చేశారు. కరోలినా మారిన్ (స్పెయిన్), జావో యునెలి, బావో జిన్ (చైనా)లు కూడా ఈ అవార్డుకు పోటీపడుతున్నారు. పురుషుల విభాగంలో చెన్ లాంగ్, జాంగ్ నాన్ (చైనా), లీ యాంగ్ డే, యూ ఇయోన్ సీయోంగ్ (కొరియా) అవార్డు రేసులో ఉన్నారు. ఎంపికైన వారి పేర్లను ఈనెల 7న దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ రిసెప్షన్, గాలా డిన్నర్లో ప్రకటిస్తారు. చెన్నై బాధితులకు రూ.2 లక్షల విరాళం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను సైనా విరాళంగా ప్రకటించింది. -
సైనా శుభారంభం
జకార్తా (ఇండోనేసియా): గతంలో తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతోపాటు శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. అయితే పి.వి.సింధుకు మాత్రం తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21-16, 21-18తో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో సింధు 21-16, 15-21, 14-21తో యా చింగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో యా చింగ్ సుతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-17, 21-7తో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... శ్రీకాంత్ 11-21, 21-14, 24-22తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)ను ఓడించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 13-21, 11-21తో లీ షెంగ్ ము-త్సాయ్ చియా సిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21-17, 19-21, 21-11తో సు యా చింగ్-పాయ్ యు పో (చైనీస్ తైపీ) ద్వయంపై గెలుపొందింది. ఇండోనేసియా ఓపెన్