కెనడా గట్టి ప్రత్యర్థే: భూపతి | Canada is strong opponent: Bhupathi | Sakshi
Sakshi News home page

కెనడా గట్టి ప్రత్యర్థే: భూపతి

Published Wed, Sep 13 2017 1:03 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

Canada is strong opponent: Bhupathi

ఎడ్మంటన్‌ (కెనడా): స్టార్‌ ప్లేయర్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ లేకపోయినా... రైజింగ్‌ స్టార్‌ డెనిస్‌ షపోవలోవ్, డబుల్స్‌ స్పెషలిస్ట్‌ వాసెక్‌ పోస్పిసిల్, డానియల్‌ నెస్టర్‌లతో కూడుకున్న కెనడా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని భారత డేవిస్‌ కప్‌ జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 17 వరకు కెనడాతో భారత్‌ తలపడనుంది.

ఈ పోటీ కోసం భారత్‌ వారం రోజులపాటు న్యూయార్క్‌లో ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేసింది. ‘రెండేళ్ల క్రితం భారత్‌లో ప్లే ఆఫ్‌ ఆడేందుకు వచ్చిన చెక్‌ రిపబ్లిక్‌ కంటే కెనడా జట్టే  పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కెనడాకు గట్టిపోటీనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని భూపతి అన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement