Bhupathi
-
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్య సంకేతాలు..
ప్రజాపతి దగ్గర సురలు, అసురులు, మానవులు తమ బ్రహ్మవిద్యాశిక్షణ పూర్తయిన తరువాత ప్రజాపతిని కలసి సందేశాత్మక ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ప్రజాపతిని కలసి గురుదేవా ‘‘మీ నుంచి మేం నేర్చుకున్నది మా జీవితాల్లో అలవరుచుకుంటూనే విధులు, బాధ్యతలు నిర్వహించదలచాము’’ అన్నారు. ప్రజాపతి ధర్మపథంలో నడవమని ఆదేశించారు. దేవతలు ముందుకొచ్చి, ‘‘మీ ఆదేశానుసారం మేము విధులను ధర్మపథంలో నిర్వహిస్తాం. మీ ఆశీస్సులతో పాటు మంచి సందేశమివ్వమని కోరారు.అప్పుడు ఒక మెరుపు ఆకాశంలో మెరుస్తూ ‘ద’ అనే శబ్ద సంకేతాన్నిచ్చింది. అప్పుడు ప్రజాపతి మీకు ఆ మెరుపు సంకేతం ఏమి అర్థమయిందని? దేవతలన్నారు మేము ‘ద’ ని దమ్యత అంటే స్వయంనిగ్రహంగా అర్థం చేసుకున్నాం. మా మనస్సాక్షి చెబుతున్నదేమంటే సుఖ, సౌఖ్య జీవనాన్ని అనుభవించేటపుడు లేదా ఆ వాంఛలు కలిగినపుడు స్వయంనిగ్రహం కావాలని. ప్రజాపతి సంతసించి బాగా అర్థం చేసుకున్నారు అన్నారు.తదుపరి ఇది చూసి మనుష్యులు కూడా ప్రజాపతిని దివ్య ఆశీస్సులతో కూడిన వీడ్కోలు సందేశాన్ని కోరారు. అప్పుడు మళ్ళీ ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో కనిపించింది. దాని సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగ్గా మనుషులన్నారు ‘‘మేము ‘ద’ ని దత్త గా అర్ధం చేసుకున్నాము. దత్త అంటే ఇవ్వు లేదా దానంచెయ్యి అని అర్థం. మేము స్వార్థ పరులం. మేము మా గురించే ఆలోచిస్తుంటాం. ఇతరులను పట్టించుకోం. కనుక మాకు అదొక దివ్యసంకేతం. మేము మాకున్నది అభాగ్యులకు దానం చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.ప్రజాపతి సంతోషించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు అన్నారు. చివరగా అసురులు వచ్చారు. అప్పుడు ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో మెరిసింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగగా మేము ‘ద’ ని దయాగుణంగా అర్థం చేసుకున్నాము. అనగా దయాగుణం కలిగి ఉండడం. మాది క్రూరస్వభావం. మా మనసు చెబుతున్నదేమంటే, ఇతరుల ఎడ ఎక్కువ దయ, జాలి కలిగి ఉండాలని, తద్వారా ప్రశాంతంగా, సంతోషంగా వుండాలని. మనం గమనిస్తే మనిషిలో ఒక్కొక్కప్పుడు దైవత్వం, మరొకప్పుడు రాక్షసత్వం కనబడతాయి.మెరుపు నుంచివచ్చిన 3 రహస్యసంకేతాలూ ద ద ద మనిషికి చక్కగా అన్వయించబడతాయి. మనలో దేవత్వం కనిపించినపుడు స్వయం నిగ్రహం పాటించాలి. అది మనకు సమయాన్ని, శక్తిని, అస్థిత్వాన్నీ ఇస్తుంది. మనం మన శక్తిని, అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం యితరులతో పంచుకుంటుంటే, అది మనలో దయను కలిగించి ఇతరులలో ఎంతో మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ఎవరెస్ట్‌పై ‘నవరత్నాల’ రెపరెపలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ‘నవరత్నాలు’ పతాకం రెపరెపలాడింది. పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాతో విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం కార్ షెడ్ ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మిష్ (28) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ 1వ తేదీన పర్వతారోహణలో విజయాన్ని నమోదు చేసుకుని ఇటీవల నగరానికి తిరిగి వచ్చాడు. విద్యార్థి దశలోనే మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటిన అన్మిష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సహకారంతో శిక్షణ పొంది తన కల నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్‌ను ప్రపంచ శిఖరంపై ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చాడు. కిలిమంజారోపై.. అన్విష్ ఇప్పటికే కిలిమంజారో, అకంకాగోవా పర్వతాలను అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతంపై ‘నో బ్యాగ్స్ డే’, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ జెండాను ఎగుర వేశాడు. మరిన్ని పర్వతాలు అధిరోహిస్తా.. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటి భూమిని కాపాడుకుందాం. ఈ దిశగా ప్రజలంతా కృషి చేయాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్‌లో ప్రపంచంలో ఎత్తైన మరిన్ని పర్వతాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను. – భూపతిరాజు అన్మిష్ -
నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?
సినిమా: ప్రఖ్యాత దివంగత నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు మింగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. కాగా, భూపతికి మద్యపానం అలవాటు ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో భూపతికి మద్యం లభించకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై భూపతి కుమారుడు రాజరాజన్ మాట్లాడుతూ.. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, మద్యం అలవాటు ఉన్న ఆయన మత్తు కోసం నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆత్మహత్యాయత్నం కాదన్నారు. వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. తల్లి మనోరమతో భూపతి -
మాజీ డీఎస్పీ భూపతి ఇంట్లో టాస్కఫోర్స్ సోదాలు
-
కెనడా గట్టి ప్రత్యర్థే: భూపతి
ఎడ్మంటన్ (కెనడా): స్టార్ ప్లేయర్ మిలోస్ రావ్‌నిచ్ లేకపోయినా... రైజింగ్ స్టార్ డెనిస్ షపోవలోవ్, డబుల్స్ స్పెషలిస్ట్ వాసెక్ పోస్పిసిల్, డానియల్ నెస్టర్లతో కూడుకున్న కెనడా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 17 వరకు కెనడాతో భారత్ తలపడనుంది. ఈ పోటీ కోసం భారత్ వారం రోజులపాటు న్యూయార్క్‌లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసింది. ‘రెండేళ్ల క్రితం భారత్‌లో ప్లే ఆఫ్ ఆడేందుకు వచ్చిన చెక్ రిపబ్లిక్ కంటే కెనడా జట్టే పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కెనడాకు గట్టిపోటీనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని భూపతి అన్నాడు. -
ట్రాక్టర్, బైక్ ఢీ: ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన జెల్ల యాదగిరి, వంగ తిరుపతి, భూపతి రాములు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లికి అంగీకరించలేదని.. నాటు తుపాకీతో కాల్పులు
కుప్పం: పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన బాలికపై ఒక యువకుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈసం ఘటన రావుకుప్పం వుండలంలో బుధవారం చోటుచేసుకుంది. రావుకుప్పం వుం డలం బందార్లపల్లె పంచాయుతీకి చెందిన గడ్డూరు యూనాది కాలనీకి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన భూపతి పెళ్లి చేసుకోవాలంటూ కొద్ది రోజులుగా వేధిస్తున్నా డు. బుధవారం కూలిపనుల కోసం ఒంటరిగా వెళుతున్న బాలికపై భూపతి హత్యాయుత్నానికి పాల్పడ్డాడు. ముఖానికి గుడ్డ కట్టుకుని నాటు తుపాకీతో బాలిక కాళ్లపై కాల్చాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలియడంతో పక్కనే ఉన్న గొర్రెల కాపరులు బాలికను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడు బాలికకు వరుసకు అన్న కావడంతో పెళ్లికి నిరాకరించినట్లు చెప్పాడు. బాలిక నుంచి తహశీల్దార్ అబ్దుల్ మునాఫ్ వాంగ్మూలం సేకరిం చి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.