పెళ్లికి అంగీకరించలేదని.. నాటు తుపాకీతో కాల్పులు | Youngster gun shot fire on girl rejecting with his marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి అంగీకరించలేదని.. నాటు తుపాకీతో కాల్పులు

Published Thu, Aug 14 2014 6:21 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

పెళ్లికి అంగీకరించలేదని.. నాటు తుపాకీతో కాల్పులు - Sakshi

పెళ్లికి అంగీకరించలేదని.. నాటు తుపాకీతో కాల్పులు

కుప్పం: పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన బాలికపై ఒక యువకుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈసం ఘటన రావుకుప్పం వుండలంలో బుధవారం చోటుచేసుకుంది. రావుకుప్పం వుం డలం బందార్లపల్లె పంచాయుతీకి చెందిన గడ్డూరు యూనాది కాలనీకి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన భూపతి పెళ్లి చేసుకోవాలంటూ కొద్ది రోజులుగా వేధిస్తున్నా డు. బుధవారం కూలిపనుల కోసం ఒంటరిగా వెళుతున్న బాలికపై భూపతి హత్యాయుత్నానికి పాల్పడ్డాడు.

ముఖానికి గుడ్డ కట్టుకుని నాటు తుపాకీతో బాలిక కాళ్లపై కాల్చాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలియడంతో పక్కనే ఉన్న గొర్రెల కాపరులు బాలికను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడు బాలికకు వరుసకు అన్న కావడంతో పెళ్లికి నిరాకరించినట్లు చెప్పాడు. బాలిక నుంచి తహశీల్దార్ అబ్దుల్ మునాఫ్ వాంగ్మూలం సేకరిం చి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement