అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ | captain of the American cricket team is Hyderabad | Sakshi
Sakshi News home page

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

Published Wed, Sep 13 2017 1:11 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ - Sakshi

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

హైదరాబాద్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇబ్రహీమ్‌ ఖలీల్‌ అమెరికా జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మంగళవారం ప్రారంభమైన ఆటీ కప్‌ వన్డే టోర్నమెంట్‌తో అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

హైదరాబాద్‌ తరఫున 57 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఖలీల్, యూఎస్‌ఏ తరఫున ఐదు వన్డేలు ఆడగా... జట్టులో జరిగిన భారీ మార్పుల్లో భాగంగా అతనికి ఇప్పుడు కెప్టెన్సీ దక్కింది. ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో 14 మందిని అవుట్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా ప్రపంచ రికార్డు ఖలీల్‌ పేరిట ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement