త్వరలో ‘క్యాట్‌’ క్రికెట్‌ టోర్నీ | cat cricket tourney very soon | Sakshi
Sakshi News home page

త్వరలో ‘క్యాట్‌’ క్రికెట్‌ టోర్నీ

Published Fri, Jul 14 2017 10:46 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

త్వరలో ‘క్యాట్‌’ క్రికెట్‌ టోర్నీ

త్వరలో ‘క్యాట్‌’ క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ఏర్పాటైన క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (క్యాట్‌) ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నీ జరుగనుంది. పాఠశాల స్థాయిలో ‘తెలంగాణ స్కూల్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీఎస్‌పీఎల్‌)’ పేరుతో జూలై చివరివారంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.  భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఈ లీగ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్‌ రెండు స్థాయిల్లో జరుగనుంది.

 

ఈలీగ్‌లో రాణించిన క్రీడాకారులతో ఒక జట్టును ఎంపిక చేసి ముంబైలోని వెంగ్‌సర్కార్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదే జట్టు ముంబై అండర్‌–17 జట్టుతోనూ ఆడుతుందని క్యాట్‌ , టీఎస్‌పీఎల్‌ వ్యవస్థాపకులు, సెక్రటరీ సునీల్‌బాబు తెలిపారు. టీఎస్‌పీఎల్‌లో ఆడాలనుకునే వారు రిజిస్ట్రేషన్‌ కోసం  www.tspl.online  సైట్‌లో లాగిన్‌ అవ్వాలని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement