విరాట్ కోహ్లికి 'టాప్' ఛాన్స్
దుబాయ్: భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి మళ్లీ వన్డేల్లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశం వచ్చింది. అక్టోబర్ 8 నుంచి వెస్టిండీస్ తో ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్ లో అతడు రాణిస్తే టాప్ కు చేరతాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఈ ఏడాది ఆరంభంలో అగ్రస్థానం నుంచి మూడోస్థానికి పడిపోయాడు కోహ్లి.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీవిలియర్స్, హషిమ్ ఆమ్లా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కోహ్లి కంటే డీవిలియర్స్ 24 రేటింగ్ పాయింట్లు అధికంగా కలిగివున్నాడు. ఆమ్లాకు మూడు పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ధోని(6), శిఖర్ ధావన్(7) టాప్ టెన్ లో ఇతర భారత ఆటగాళ్లు.