
అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ (155 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 227/4తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 154.5 ఓవర్లలో 419 పరుగుల వద్ద ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.