
బ్రిస్బేన్: బౌన్సీ పిచ్‌పై ఆస్ట్రేలియా పేస్ త్రయం కమిన్స్ (4/39), రిచర్డ్‌సన్ (3/26), స్టార్క్ (2/41) రాణించడంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌటైంది. ఈ డే నైట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక... ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. తిరిమానె (12)ను ఔట్ చేసి కమిన్స్ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. ఓపెనర్ కరుణరత్నె (24) కొంతసేపు నిలిచినా, కెప్టెన్ చండిమాల్ (5), కుశాల్ మెండిస్ (14), రోషన్ సిల్వా (9), ధనంజయ డిసిల్వా (5) పెవిలియన్‌కు వరుస కట్టారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ డిక్‌వెలా (78 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్... ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (40 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ నాథన్ లయన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment