పోరాడి సెంచరీ చేసిన లంక బ్యాట్స్మన్
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు దినేష్ చండీమల్ సెంచరీ(102)తో రాణించడంతో జట్టు గౌరవప్రదస్కోరు చేసింది. ఆసీస్ ముందు 227 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 49.2ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటయింది. తొలి ఓవర్లోనే లంకకు స్టార్క్ షాకిచ్చాడు. గుణతిలక(5)ను వెనక్కి పంపాడు.
తన కెరీర్ లో చివరి వన్డే మ్యాచ్ ఆడుతున్న దిల్షాన్ (65 బంతుల్లో 42, 5 ఫోర్లు) రాణించాడు. అయితే ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక వరుస విరామాలలో వికెట్లు కోల్పోయింది. అయితే టాపార్డర్ బ్యాట్స్ మన్ చండీమల్(130 బంతుల్లో 102, 7 ఫోర్లు) చివరి ఓవర్ వరకూ నిలిచి జట్టుకు పరుగులు జోడించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఫాల్కనర్ బౌలింగ్ లో చండీమల్ ఇచ్చిన క్యాచ్ ను జంపా పట్టడంతో 226 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హెస్టింగ్స్, ఫాల్కనర్ తలో రెండు వికెట్లు తీయగా, హజెల్ వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.